కన్నుల పండుగగా అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనం

గుంటూరు: మకర సంక్రాంతిని పురస్కరించుకుని అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనం భక్తుల నడుమ అత్యంత కన్నుల పండుగగా జరిగింది. అయ్యప్పస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలో సోమవారం మకరజ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి ఉపాసకురాలు శైలజమ్మ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, పత్తిపాడు సమన్వయ కర్త కొర్రపాటి నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, బీజేపీ నాయకురాలు శ్రావణ కుమారిలు మకరజ్యోతిని వెలిగించారు. ఈ సమయంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. తొలుత అయ్యప్పస్వామి పూజ, పడిపూజ నిర్వహించారు. సంతోష్ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి పాటలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. సుబ్రహ్మణ్యం, నెల్లూరు రామకోటి వాసు, వేణు, జక్కా రమేష్, నాగేంద్రబాబు, రామిశెట్టి శ్రీను, అడపా రామకృష్ణ, హరి, ఎర్ర బాషా, నాగూర్, షర్ఫుద్దీన్, ఒంగోలు శ్రీను, శేషు, రవీంద్ర, కరీం, బాషా, నీలకంఠం, పులిగడ్డ గోపి, తిరుమలరావు, కోలా మల్లి, చౌదరి శ్రీను, గౌస్, కాసులు, కామేష్, లోకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.