పవన్ కళ్యాణ్ ని కలిసిన బి లక్ష్మన్న

కర్నూలు, శనివారం రోజున ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం, పూసలపూడి గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ని మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మన్న కలవడం జరిగింది. కొన్ని విషయాల గురించి తమరితో చర్చించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె పవన్ కళ్యాణ్ ని బి లక్ష్మన్న జనసేన పార్టీ ఇంచార్జ్ అభ్యర్థించారు. జనసేన పార్టీ బలోపేతం గురించి, వాల్మీకి బోయల ఎస్టీ బిల్ గురించి కూలంకషంగా చర్చించి మాట్లాడాలని కోరడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి తొందర్లో కలిసి మాట్లాడదామని కె పవన్ కళ్యాణ్ బి లక్ష్మన్నకి హామీ ఇవ్వడం జరిగింది.

Share this content:

Post Comment