విజేతలకు బహుమతి ప్రధానం చేసిన బి.లక్ష్మణ్

కర్నూలు జిల్లా, కౌతాల మండలం, బదినేహాల్ గ్రామంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంటు విజేతలకు బహుమతులు అందచేయడానికి ముఖ్య అతిధిగా మంత్రాలయ ఇంచార్జీ బి.లక్ష్మణ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ క్రీడల అంటే కేవలం మానసికంగా, శారీరకంగా గానే కాకుండా మన దేశానికి గొప్ప పేరు తెచ్చే స్థాయికి తీసుకెళ్తాయని, స్పోర్టీవ్ గా, మంచి స్నేహ సంబంధాలతో కలిసిమెలసి ఉంటారని చెబుతూ, తన క్రీడా స్ఫూర్తిని తెలయచేశారు. ఈ కార్యక్రమంలో బదినేహాల్ టీడీపీ సీనియర్ నాయకులు నరసింహులు, ఏసన్న, జనసేన నాయకులు లక్ష్మణ్ ని సన్మానించడం జరిగింది. తదనంతరం పోటీలో విజేతలుగా నిలిచిన కాత్రి టీమ్ కి రూపాయలు 15000/-, రన్నర్ టీమ్ కి రూపాయలు 10000/- బహుమతులు అందచేసి తన క్రీడస్పూర్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చిన్న, బిజెపి నాయకులు రమేష్, జనసేన నాయకులు ఈ.రెడ్డి వి.సుమిత్ర, తిక్కన్న, ఈరన్న, సంఘీ నాగరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment