తిరుపతిలో బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

తిరుపతిలోని చెన్నా రెడ్డి కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత, మానవ హక్కుల పరిరక్షకుడు డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకోవడం నాకు ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ పిఏసి సభ్యులు అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ చూపిన సమానత్వ మార్గం, హక్కుల సాధన కోసం ఆయన సాగించిన పోరాటం, సామాజిక న్యాయం పట్ల ఆయనకు ఉన్న దృఢ నమ్మకం — ఇవన్నీ నేటి సమాజానికి మార్గదర్శక తీరుగా నిలుస్తున్నాయి. ఈ వేడుకల్లో ప్రజల ఉత్సాహాన్ని చూస్తే, అంబేద్కర్ గారి భావజాలం యువతలో ఎలా చైతన్యంగా మారిందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చెన్నా రెడ్డి కాలనీ వాసులకు, సంఘ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనమంతా కలిసి బాబాసాహెబ్ కలల భారతాన్ని నిర్మిద్దాం అని హరి ప్రసాద్ పేర్కొన్నారు.

Share this content:

Post Comment