జనసేన మరియు బీజేపీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు గళం విప్పిన బి.సావరం యువసేన

ఎంపీలందరు పార్లమెంటులో సేవ్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్లకార్డులతో నిరసన్ తెలపాలి: రావూరి నాగబాబు
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి: చిట్నీడి శ్రీనివాసరావు

రాజోలు నియోజకవర్గం, బి.సావరం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రావూరి నాగబాబు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దింపు కార్మికులను వివరాలు అడగగా తాము విజయనగరం జిల్లా నుండి రాజోలులో దింపు పనులకు వచ్చామని ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో అక్కడి వివిధ రకాల వృత్తుల వారు వలసలు బాట పట్టారని తెలియచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయొద్దని వారు ప్రభుత్వానికి తెలియ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మించిన నాటి నుంచి ఎంతో మంది కార్మికులు, కార్మిక నాయకులు ప్రాణత్యాగాలు చేశారని వారు వాపోయారు. ముఖ్యంగా యువకులు సైతం ఉక్కు పరిశ్రమ కోసం బలిదానాలు చేశారు వారి ఆత్మ శాంతి కోసం అయిన ప్రైవేటీకరణ చేయొద్దు అని వారి బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రావూరి నాగబాబు మాట్లాడుతూ కార్మికులకు న్యాయం చేయాలని ఎంపీలందరు పార్లమెంటులో సేవ్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన రాష్ట్ర ప్రజల తరుపున వినతిపత్రాలు ఇవ్వాలి అన్నారు.

అనతరం బీజేపీ నాయకులు చిట్నీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్న వైసీపీ, టిడిపి ఎంపీలకు నిరసన గళాన్ని వినిపించారు. రాష్ట్రా ప్రభుత్వం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు. బి.సావరము యువత మాట్లాడుతూ యువతకి ఉపాధి కల్పించే పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం తగదు అని యువతకి ఉపాధి చూపాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నది అన్నారు. జనసేన అదినేత శ్రీ పవన్ కళ్యాణ్ చూపిన శాంతి మార్గంలో వెళ్తున్నామని అన్నారు.