ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు బిజెపి మాజీ మండల అధ్యక్షులు శ్రీమతి జీపాలెం తేజోవతి ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని ఎస్ఎన్ పురం నందు మరియు వెదుళ్ళచెరువు నందు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జీవన పర్యంతం దళితుల సాధికారత కోసం అహర్నిశలు శ్రమించారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని తెలిపారు. ఎన్డిఏ ప్రభుత్వంలో వారికి భారతరత్న బిరుదు లభించడం చాలా సంతోషమని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ ఆశలు, ఆశయాల సాధన కోసం శ్రమించాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రేమ్ రెడ్డి, శ్రీనివాసులు, మహేంద్ర, మురళి, జగన్మోహన్ రెడ్డి, వేణు, రాజశేఖర్, సురేష్, నలిని, సుమతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment