చింతలపాలెం గ్రామంలో బాబు ఘారిటి-భవిష్యత్ గ్యారెంటీ

కనిగిరి, వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమ పాలన అంతమయ్యేందుకు రోజులు దగ్గర పడ్డాయని టిడిపి మండల నాయకులు పువ్వాడి నాగరాజు అన్నారు. ఆదేశాల మేరకు సోమవారం పీసీ పల్లి మండలం పెద అలవలపాడు, చింతలపాలెం గ్రామంలో బాబు ఘారిటి-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టిడిపి కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో కనిగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ఆశీర్వదించి కనిగిరి ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీ పల్లి మండల, జనసేన నాయకులు ఎండ్లూరి శ్రీకాంత్ 195 బూత్ ఇంచార్జి బొజ్జా తిరుపతయ్య, తిరుపాల్, బోయెజ్ తదితరులు పాల్గొన్నారు.