*జనసేన నేత తిరుపతి అనూష ఆధ్వర్యంలో ఘన నివాళులు
సామాజిక న్యాయం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహానేత బాబూ జగజ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకొని, తిరుపతి జనసేన నాయకురాలు అనూష ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బాబూ జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనూష మాట్లాడుతూ – “ఆయన స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాల్లో సమానత్వాన్ని మేలు చేసిన ఆదర్శ నేత. వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యాంగంలోని సామాజిక న్యాయం సూత్రాల అమలుకు జీవితాంతం పాటుపడ్డారు. ఈనాటి యువత ఆయన ఆశయాలను అనుసరించి, సమాజ అసమానతలపై పోరాటం చేయాలి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 40 నుంచి 49 డివిజన్ల జనసేన నాయకులు పాల్గొని, బాబూ జగజ్జీవన్ రావుకి పుష్పాంజలులు సమర్పించారు. నేతలుగా సోంపక చినబాబు, నారాయణ స్వామి, ప్రదీప్ రాజ్, శ్యాం సుందర్, కత్తి రామయ్య, బళ్లారి గణేష్, బండి శ్రీను, లేళ్ళ కిరణ్, సయ్యద్ హుస్సేన్, ఎండి ఆయాజ్, తిరుమలరెడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment