*ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు, అంబాజీపేట సెంటర్ మరియు ఆక్విడెక్ వద్ద ఆయన విగ్రహాలకు పూలమాలలు అర్పించి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే “సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానాయకుడిగా జగ్జీవన్ రామ్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా దేశానికి చేసిన సేవలు అమోఘం. ఆయన ఆశయాలను అనుసరించడమే నేటి బాధ్యత,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
Share this content:
Post Comment