పిండ్రంగివలస రోడ్లను పరిశీలించిన బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: బాడంగి మండలం, పిండ్రంగివలస గ్రామం రోడ్డు సమస్య మీద గ్రామస్తుల అర్జీ మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆ గ్రామం వెళ్ళి పూర్తిగా పాడైపోయిన రోడ్డును పరిశీలించి, సంబంధిత ఆర్ & బి అధికారులుతో మాట్లాడటం కూడా జరిగింది. తక్షణమే రోడ్డు పనులు మొదలు పెట్టాలని అధికారులను కోరడం కోరగా, మరో 10 రోజుల్లో మొదలుపెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి మండల నాయకులు కొల్లి చైతన్య, రౌతు సురేష్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, ఎందవ సత్యనారాయణ, బొన్నాడ గణేష్, కనకల శ్యామ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.