టిడిపి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బాబు పాలూరు

పార్వతీపురం నియోజకవర్గం: టీడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పార్వతీపురం నియోజకవర్గ టీడిపి ఇంచార్జ్ విజయచంద్ర బలిజిపేట మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు శనివారం వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, కార్యనిర్వహణ కమిటీ జిల్లా కార్యదర్శులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.