కృష్ణాపురం గ్రామంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ

తుని: తొండంగి మండలం, కృష్ణాపురం గ్రామంలో జనసేన-తెలుగుదేశం, ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తుని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య హాజరయ్యారు. గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతూ రాష్ట్ర భవిష్యత్తుకు, మన భవిష్యత్తు కు చంద్రబాబు గ్యారెంటీ అని ప్రజలకు భవిష్యత్తు గ్యారెంటీ కర పత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైసిపి పాలనలో నిత్యవసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ విధానాలతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదు. రాష్ట్రంలో అప్పులు తప్ప, అభివృద్ధి లేదు అని అన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే టిడిపి – జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బెండపూడి నాయుడు గారు, కృష్ణాపురం గ్రామ అధ్యక్షులు మాకినీడి శ్రీధర్, గ్రామ కమిటీ సబ్యులు, జిల్లా సంయుక్త కార్యదర్శి లోవరాజు, మండల ప్రధాన కార్యదర్శి నాగబాబు, తొండంగి గ్రామ అధ్యక్షులు ఎలుగుబంటి నాగు, చినయ్యపాలెం గ్రామ అధ్యక్షులు వీసం ఆనందరావు, బెండపూడి గ్రామ అధ్యక్షులు కోరుకొండ శివ, కోటనందురు మండల నాయకులు ప్రవీణ్ పెనుమాచు, మనం రవి, హరీష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.