పుంగనూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ

పుంగనూరు పట్టణం హైస్కూల్ రోడ్డు, పాత ఎమ్మార్వో ఆఫీసు కూడలి, రాతిమసీదు వీధి, బ్రహ్మణవీధి ఏవిరావు వీధి, బజారువీధి నందు నేడు ఇంటింటికి మీ చల్లా రామచంద్రారెడ్డి కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ చల్లా రామచంద్రా రెడ్డి జనసేన పార్టీ ఇంచార్జీ చిన్నా రాయల్. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం-జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్దఎత్తున చల్లా రామచంద్రా రెడ్డికి పూలమాలలతో సన్మానించి బాణసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు చల్లా రామచంద్రా రెడ్డిని చూడగానే ఆప్యాయంగా పలకరించారు మీ విజయం తథ్యం అని తెలియచేశారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీ “మినీ మ్యానిఫెస్టో” కరపత్రాన్ని ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు ఇస్తూ తెలుగుదేశం-జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తక్షణమే పేద ప్రజల ఏ విధముగా లబ్ది చేకూరుతుందో తెలియచేస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.