గుంటూరు: అమరావతి రోడ్డులోని సేవాసదన్ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు 78వ జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తీ వీరాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ, “రంగా బడుగు, బలహీన వర్గాల కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు. ఆయన ‘కాపునాడు’ నినాదం లక్షలమంది హృదయాలను కదిలించింది,” అని పేర్కొన్నారు. జాస్తీ వీరాంజనేయులు మాట్లాడుతూ, “అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వీరోచితంగా ఎదిరించిన విప్లవజ్యోతి. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న రంగా గారు కూడా ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు,” అని వివరించారు. సేవాసదన్ అధ్యక్షుడు మిరియాల గోపి కుమార్ మాట్లాడుతూ, “అవినీతి, అక్రమాలపై గర్జించిన సింహంలా ప్రజల హక్కుల కోసం పోరాడిన నేత రంగా గారు,” అని కొనియాడారు. జనసేన పట్టణ కార్యదర్శి కలగంటి త్రిపురా కుమార్ మాట్లాడుతూ, “కేవలం 3 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉండి కూడా రంగా గారు పొందిన పేరు, గౌరవం ఈయన గొప్పతనానికి నిదర్శనం,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల ప్రసాదరావు, పబ్లిక్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ జోన్నలగడ్డ వెంకటరత్నం, బి. రాజశేఖర్, కోచ్చెర్ల చిన్నులు, అన్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment