బాలు గారి మరణం చాలా బాధాకరం: జనసేనాని

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాలు చనిపోయారని మధ్యాహ్నం తన ఆఫీసు సిబ్బంది తనకు చెప్పారని తెలిపారు. కరోనా బారిన పడ్డానని, కోలుకుంటున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలు చెప్పారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని తాను కూడా ఆకాంక్షించానని చెప్పారు.

బాలు కోలుకోవాలని యావత్ దేశం కోరుకుందని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమైపోయారని అన్నారు. బాలుగారిని చిన్నప్పటి నుంచి చూశానని, ఆయనంటే తనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పారు. ఇలాంటి స్థితిలో ఆయన మృతి చెందడం కలచివేస్తోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.