శివాలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న బండారు

*మోదుకూరు గ్రామంలో వైభవంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ – శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామిని దర్శించుకున్న బండారు

ఆలమూరు మండలంలోని, మోదుకూరు గ్రామం నందు శుక్రవారం శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయమునందు నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా గ్రామస్తులు, పలువురు పెద్దలు జరిపించినారు. ఈ కార్యక్రమమునకు పలు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్, శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారిని, దర్శించుకుని, తీర్థ ప్రసాదములు స్వీకరించి, వేదపండితుల ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణం గత కొద్ది రోజుల కిందట పునర్నిర్మించిన కారణంగా, ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట నిర్మాణమును, మామిడికుదురు మండలానికి చెందిన బ్రహ్మశ్రీ పూజ్యం సుబ్రహ్మణ్య శర్మ, జగన్నాథ శర్మ ఆశీస్సులతో పూజ్యం విశ్వనాథ శర్మ సారథ్యంలో వైభవంగా శుక్రవారం వేదపండితులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు గ్రామంలో ఉన్న ప్రజలు, మహిళలు పూజాది కార్యక్రమాలు నిర్వహించి, వేద పండితులు వేద మంత్రాలతో, బాజాభజంత్రీలతో గ్రామమంతా అన్ని వీధులు కిక్కిరిసిపోయి, శివ నామస్మరణతో మార్మోగినది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి ఆశీస్సులు పలువురు ప్రజలు, నాయకులు పొంది ఉన్నారు. గత మూడు రోజుల నుంచి ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణతో, భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించినారు, ప్రతి ఒక్కరికి వాటర్ ప్యాకెట్లను సప్లై చేసి, శుక్రవారం భారీ ఎత్తున 10 వేల మందికి, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస్, వెంట, తులా రాజు, కె, చంటి,గారపాటి త్రిమూర్తులు, సలాది జయప్రకాష్ నారాయణ (జెపి) ఆలమూరు మండల జనసేన అధ్యక్షుడు సూరపు రెడ్డి సత్య, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.