గృహప్రవేశ వేడుకకు ముఖ్య అథిదిగా హాజరైన బండారు శ్రీనివాస్

  • ఆత్మీయతతో పిలిస్తే! ఎవరు పిలిచినా మేమున్నామని, ఆత్మీయతతో ముందుంటూ… అన్ని వర్గాల వారు జనసేనాని ఆశయాలను ఆదరించాలని కోరుకుంనే.. బండారు శ్రీనివాస్

కొత్తపేట నియోజకవర్గం: ఆలమూరు మండలం నందు ఆలమూరు టౌన్ లో శుక్రవారం ఆలమూరు ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు నామన దుర్గాప్రసాద్ (డి.పి రావు) నూతన గృహప్రవేశం మహోత్సవం ఆలమూరు గణేష్ కాలనీ నందు జరిగినది. ఈ గృహప్రవేశ కార్యక్రమం ఎంతో ఘనంగా, వైభవంగా పెద్దలు, పండితులు సమక్షంలో పూజాది కార్యక్రమాలతో నిర్వహించినారు. ఈ వేడుకలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ ఎంతో ఆత్మీయతతో దగ్గరుండి ఆ దుర్గాప్రసాద్ రావు దంపతుల చేత వైభవంగా జరిపించారు. అనంతరం శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసి పలువురికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన కొత్తపేట నియోజకవర్గ ప్రముఖ నేత, ప్రజా సేవకులు, అందరికీ గొప్ప ఆత్మీయులు, మానవతా విలువలతో ముందుకు సాగే గొప్ప జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ నేతగా, ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమంనకు పిలిచిన వెంటనే పార్టీలకు అతీతంగా బండారు శ్రీనివాస్ వచ్చి, తన చిరకాల మిత్రులు నామన దుర్గాప్రసాద్ కొత్తగా నిర్మించుకున్న ఇంటికి తన జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలతో హాజరైనారు. ఆ గృహప్రవేశ వేడుకను నిర్వహించిన డి పి. రావు దంపతులకు శుభాకాంక్షలు అందజేస్తూ, అనేక శుభాలు జరగాలని భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పలువురు ప్రముఖులు తాళ్ల డేవిడ్ రాజ్ ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సంగీత సుభాష్ పినపళ్ల సర్పంచ్ ఉమ్మడి జిల్లా జనసేన కార్యదర్శి, చల్లా వెంకటేశ్వరరావు, సిరిగినీడి పట్టాభి, కట్టా రాజు ఆలమూరు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, పరమట గణేష్, భావన శివశంకర్ జొన్నాడ, కొత్తపల్లి నగేష్ ప్రముఖ జనసేన యువనాయకులు మడికి, ఆలమూరు మండలం, జడ్పిటిసి అభ్యర్థి జనసేన నాయకులు, ఆలమూరు మండలం జనసేన అధ్యక్షులు సురపరెడ్డి సత్య,కొండేపూడి హేమా దేవి, కోట వరలక్ష్మి,పలువురు ప్రముఖ జనసేన నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.