పురాణపండ రామూర్తిని పరామర్శించిన బండారు శ్రీనివాస్

ఆలమూరు గ్రామ ప్రముఖ పెద్దలు పురాణపండ రామూర్తిని పరామర్శించిన బండారు శ్రీనివాస్ జనసేన ఇన్చార్జ్!

తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలంలోని, ఆలమూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యక్తులు, పెద్దలు, పూజ్యనీయులు అయిన పురాణపండ రామూర్తి వారిని బుధవారం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్, ఆలమూరులో వారి స్వగృహంనకు వెళ్ళి వారి ఆరోగ్యం గురించి వాకబు చేసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో, పురాణపండ రామూర్తి అనారోగ్యానికి గురికావడంతో రామ్మూర్తి వారిని, వారి కుటుంబ సభ్యులను బండారు శ్రీనివాస్ కలిసి ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు, తాళ్ల డేవిడ్, కట్టా రాజు, చల్లా వెంకటేశ్వర రావు, శిరిగినీడి పట్టాభి, దాసి మోహన్, లంకె ధన కృష్ణ, కొప్పాడి జయరాజ్, కోట వరలక్ష్మి, కార్యకర్తలు బండారు శ్రీనివాస్ వెంట ఉన్నారు.