పలు పరామర్శలలో పాల్గొన్ని స్వర్గస్తులైన వారికి నివాళులు అర్పించిన బండారు శ్రీనివాస్

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో ఇటీవల కాలం చేసిన చల్లా నారాయణ మూర్తి, దూలం సత్యవతి, వెలవలపల్లి ఉషశ్రీ, వెలవలపల్లి హైమావతి, మోటురి భాస్కరరావు, ఆచంట గంగరాజు, చీమల సత్యవతి కుటుంబ సభ్యుల గృహాలకు వెళ్లి ఒదార్చి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఆనంతరం వెలమలపల్లి ఉషశ్రీ, హైమవతి కుటుంబాలకు జనసైనికులు రాయుడు వెంకటేశ్వర రావు(బెహరిన్) చిరిగినేడి పట్టాభి, చల్లా బాబీ, చల్లా వెంకటేశ్వరరావు, దేశభక్తుల సత్యనారాయణ, చేసిన ఆర్థిక సహాయం కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా అందించేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా స్పందిస్తున్న జనసైనికులను బండారు శ్రీనివాస్ అభినందిస్తూ, ప్రతి సమస్యలో తాను ముందు ఉండి నడిపిస్తున్న జనసెనని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అశయలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిపోవాలని బండారు శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, కొత్తపల్లి నగేష్, సలాది జేపి, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా బాబీ, దేశబత్తుల సత్యనారాయణ, మహాదశ బాబులు, చింతపల్లి సత్తిపండు, పులుపు కరుణాకర్, చల్లా శ్రీను, కట్టా రాజు, పెట్ట రంగనాథ్, కోట వరలక్ష్మి, కొండేటి రమాదేవి, జనాసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.