ఇంటింటా జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ప్రారంభించిన బండారు శ్రీనివాస్

కొత్తపేట: పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు నేటి నుండి మూడోవ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభిస్తూ ముందుగా కోనసీమ తిరుమల (వాడపల్లి) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వాడపల్లి గ్రామం నుండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్ళి జనసేన పార్టీ గురించి వివరిస్తూ పార్టీకి అండగా నిలబడిన వాళ్ళ కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏవిధంగా అండగా నిలబడుతున్నారో వివరిస్తూ, సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ అందిస్తూ సేవలను వివరించారు. దానికి సంబంధించిన ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాన్ని ఇంటింటికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్ళ డేవిడ్, దొంగా సుబ్బారావు, మండల అధ్యక్షులు చేకూరి కృష్ణం రాజు, తోట స్వామి, కంఠంశెట్టి చంటి, నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ శివశంకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు నారాయణ రావు, నాయకులు మహదశ బాబులు, తుల రాజు, బండారు అబ్బులు, బండారు బాబీ, పడాల అమ్మిరాజు, సాధనాల అమ్మిరాజు, కొత్తపల్లి నగేష్, ఏపుగంటి మునేశ్వరరావు, ఏపుగంటి సుబ్బారావు, పైడికొండల సీతారాం, రావూరి తాతయ్య నాయుడు, అడ్డగళ్ళ నాగేశ్వరరావు, తోలేటి లక్ష్మణరావు, యేరుబండి సత్యనారాయణ, కొప్పుల దుర్గప్రసాద్, నాగిరెడ్డి మహేష్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.