ఆత్మకూరు నియోజకవర్గ తాత్కాలిక కో-ఆర్డినేటర్ గా బండి అనిల్ రాయల్

నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ జన సైనికులకు ముఖ్య గమనిక నియోజకవర్గంలో అందరిని కలుపుకుంటూ కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం తాత్కాలికంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఇన్చార్జిల మరియు జనసైనికుల అభిప్రాయాలతో బండి అనిల్ రాయల్ ని నియోజవర్గ కో-ఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి అనుసంధానంగా నియోజకవర్గ ఉపాధ్యక్షులు డబ్బుకొట్టు నాగరాజు యాదవ్ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున వారిరువురికి ఆత్మకూరు నియోజకవర్గంలోని జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు మరియు జనసైనికులు సహకరించవలసిందిగా కోరుకుంటున్నానని నలిశెట్టి శ్రీధర్ తెలిపారు.