అన్న సమారాధనకు భూరి విరాళం ఇచ్చిన బండిరామకృష్ణ

మచిలీపట్నం: (ఆర్ ఎన్ ఐ)మచిలీపట్నం బస్టాండ్ సెంటర్ లోని తోట నర్సయ్య టాక్సీ వర్కర్స్ మరియు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవకోదండ రామ్ మందిరం కమిటీ తరఫున మంగళవారం ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమంలో మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న అని.. కుల, మత భేదాలు విడనాడి అందరం అన్నదమ్ములవలే కలిసి మెలిసి ఉండాలని.. మన మతాలను ప్రేమిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు.
జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు మాట్లాడుతూ.. రామ మందిరంవారు నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ రూ 15,000 రూ.లు విరాళంగా అందజేసి.. అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని.. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డనచేశారని తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగిందని గడ్డం రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామమందిర కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీర్, జన్ను నాగరాజు, భావిరెడ్డి మురళి, చలమల శెట్టి పోతురాజు, యశ్వంత్, తోట రాజేష్, నరసింహ, చక్రి, పుర ప్రజలు, భక్తులు వేలాదిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.