అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించిన బండ్రెడ్డీ రామకృష్ణ

అవనిగడ్డ: మోపిదేవి మండలంలోని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సోమవారం మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ అధ్వర్యంలో.. కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పరిశీలించి నష్టపోయిన రైతులను, కౌలు రైతులను పరామర్శించారు. అలాగే వారికి ఆర్ధిక సహాయం చేయాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులు, నియోకవర్గ వీర మహిళలు, నియోజకవర్గ నాయకులు, మోపిదేవి మండల కమిటీ నాయకులు, మండల స్థాయి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.