*జూలై 6 నుంచి ఐదు రోజులపాటు రొట్టెల పండుగ నిర్వహణ
*జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు
*రొట్టెల పండుగ ఏర్పాట్లు పరిశీలన
నెల్లూరు, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ జూలై 6వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే చకచకా జరుగుతున్నాయని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. ఆదివారం బారాషహీద్ దర్గా వద్ద జరుగుతున్న పనులను ఆయన జన సైనికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకే ప్రత్యేకమైన ఈ రొట్టెల పండుగ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. దేశ విదేశాల నుంచి కుల మతాలకు అతీతంగా ఇక్కడికి ప్రజలు విచ్చేస్తారని అన్నారు. వారి కోసం మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్న మయ్యారన్నారు. ముందుగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని రొట్టెల పండగలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు.తమ కోర్కెలు నెరవేరాయని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి, సంక్షేమం దూసుకెళ్ళేలా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు రొట్టెలు పండుకు రావాలని ఆహ్వానం అందించామని, ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చప్పిడి శ్రీనివాసులురెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, నాగరత్నం, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ భవాని నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్ బాబు, డివిజన్ ఇంచార్జిలు పెడాడ ఆనంద రావు, చిత్తూరు రాము , చుక్కల భీమయ్య, బిల్లా ఉదయకిరణ్ , శ్రీమంతుల కిషోర్, భార్గవ్ రాముడు, నితీష్, షానవాజ్, లాల్ మస్తాన్, రూరల్ ఐటీ కో-ఆర్డినేటర్ చరణ్ రామ్, నగర నాయకులు శేషయ్య, హరీష్, కవిత, మల్లిక, రాజేశ్వరి, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment