బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డుకు ఎంపికైన బసవతారకం హాస్పిటల్‌

కరోనా సమయంలో అందించిన సేవలకు గుర్తింపుగా బసవతారకం హాస్పిటల్ ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీ రీసెర్చ్ సంస్థ వారు బసవతారకం హాస్పిటల్‌ను బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డుకు ఎంపిక చేశారు. వీక్ మాగ్జిన్ వారు అందించే బెస్ట్ క్యాన్సర్ హాస్పటల్ అవార్డుల్లో ఈ హాస్పిటల్ ఆరవ స్థానం పొందింది. రామగుండంకు చెందిన శివాజీ అనే ఆర్ఫన్‌కు ఉచితంగా బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ చికిత్స అందించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్‌ను విజిట్ చేసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.