నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసిన బస్వ లలితా గోవిందరెడ్డి
ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కొచ్చెర్ల పంచాయతీ సర్పంచ్ మరియు రణస్థలం మండలం జనసేన నాయకులు బస్వ లలితా గోవిందరెడ్డి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొచ్చెర్ల పంచాతీలో సుమారు 1000 మంది నిరుపేద కుటుంబాలకు చీరలు, దుస్తులు మరియు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బస్వ గోవింద రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంక్రాంతి పండుగ కు మా ఇంటి వద్ద నిరుపేదలకు నాకు తగిన సాయం ప్రజలకు చేయడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/ni-1024x576.jpg)