నెల్లూరు నగర మూడో డివిజన్ ప్రశాంతినగర్ కూడలిలో మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని మున్సిపల్ కార్మికుల చేత ప్రారంభించిన జనసేన పార్టీ స్థానిక ఇంచార్జ్ బత్తల శ్రీకాంత్ గారు, కార్మికులపై ప్రేమను చాటుతూ వారికి చీరలు, దుస్తులను పంపిణీ చేశారు. మజ్జిగ, మంచినీళ్లను స్థానిక ప్రజలకు అందజేసారు. ఈ కార్యక్రమం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరియు జిల్లా పరిశీలకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనల మేరకు నిర్వహించబడింది. డొక్కా సీతమ్మ సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ చలివేంద్రం ప్రారంభించినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన నాయకులు లోకేష్, గణేష్, వేణుగోపాల్, రామకృష్ణ, చిన్న, జనార్ధన్, లీల, తేజస్విని, మహేష్, జరీనా, ప్రసన్న, సన్నీ మరియు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment