వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో “జనంకోసం జనసేన” “మహా పాదయాత్ర” సందర్భంగా ప్రెస్ మీట్ లో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు గడపగడపకు మన ప్రభుత్వం పేరిట వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని అడ్డుగోలుగా వాడుకుంటూ పూర్తిగా వైసీపీ కార్యకర్తల్లా, వైసీపీ నాయకుల్లా మార్చేసి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేయడం చాలా విడ్డురంగా వింతగా ఉంది. లేని అభివృద్ధిని ఉందని ప్రజల్ని మభ్యపెడుతూ.. ఎప్పటినుండో ఇస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలు కాకుండా, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంతమందికి ఎన్ని పథకాలు ఇచ్చారు. కొంత మందికే ఇచ్చే సంక్షేమ పధకాలను మొత్తం అందరికీ ఇస్తున్నట్టు చూపిస్తూ ప్రజల మధ్యకు ప్రభుత్వ ధనంతో తిరుగుతూ, ఏదో అద్భుతం చేసినట్టు పంప్లేట్స్ రాసుకొచ్చి, ప్రజల డబ్బును పూర్తిగా దుర్వినియోగం చేస్తూ సమస్యలు ఉన్న వారి ఇళ్లకు వెళ్లకుండా, వారికి కనపడకుండా రోడ్డులు, డ్రైనేజ్లు లేని వీధులకు వేళ్లకుండా. వెళితే అక్కడ ప్రజలు అడగే సమస్యలకు సరిగా సమాధానం చెప్పాలేక తప్పించుకుని తిరుగుతున్నారు. కొంతమందికే ఇచ్చిన ప్రభుత్వ పథకాలు అందిన ఇళ్లకు వెళ్లి, వాళ్ళ చేత పొగిడించుకుని వాటినే మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలకు వారి సొంతడబ్బులు, వాళ్ల తాతల తండ్రలు సంపాదించిన సొమ్ములు ఇస్తున్నట్టు పనికిమాలిన బిల్డప్పులు ఇస్తున్నారు కానీ, వారు దోచుకొన్న ఇసుక దోపిడీ గురించి, మట్టి దోపిడీ గురించి, చెరువు తవ్వి మట్టి అమ్ముకోన్న దాని గురించి, కొండలు తవ్వ మట్టినిమాయం చేసిన దాని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. పేదలందరికీ ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం రైతుల దగ్గర నుంచి భూములు తక్కువ మొత్తంలో కొని, ప్రభుత్వం దగ్గరనుంచి మాత్రం ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకుని, దళారులవలె ఈ వైసీపీ నాయకులు తీసుకొన్న కమిషన్ల గురించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంత దుర్మార్గంగా అరాచక పాలన చేస్తున్న వైస్సార్సీపీ పార్టీ వాళ్లను నమ్మే పరిస్థితుల్లో లేరింక ప్రజలు. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకూ కరెంటు బిల్లులను ఆరు సార్లు రేటు పెంచారు. చెత్త మీద పన్ను వేశారు, ఆస్తులపై పన్నులు పెంచారు, రిజిస్ట్రేషన్ చార్జీలు కనీవినీ ఎరుగని రీతిలో విపరీతంగా పెంచేశారు, నెల వచ్చేసరికి ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో మూర్ఖత్వంగా, అజ్ఞానంగా నిర్ణయాలు తీసుకుంటూ, కోర్టులు చేత మొట్టికాయలు, చివాట్లు తింటూ చీ అనిపించుకుంటున్నారు, దాదాపు ఏడులక్షల కోట్లు రూపాయలు అప్పు చేసినా, రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చేశారు, రోడ్లు వెయ్యలేక రహదారులను నరకకూపంగా మార్చేసిన దుస్థితి, ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేని అసమర్ధత, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేక నిస్సహాయంగా చేతులెత్తేశారు, దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా వున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు, అమరావతి రైతులను మోసం చేసి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత ఈ దుర్మార్గపు వైసీపీది, ఐటీ రంగాన్ని అడ్రస్ లేకుండా చేశారు, డ్రగ్స్ అమ్మకాల్లో మన రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టి దేశంలో మన రాష్ట్ర పరువును తీశారు, దౌర్జన్యాలు, దాడుల్లో బీహార్ కంటే మన రాష్ట్రాన్నే ముందు వరుసలో నిలబెట్టారు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చెయ్యడంలో ఈ వైసీపీలో ప్రభుత్వాన్ని మించింది లేదు, 34 అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుండి రావలసిన నిధులను రాబట్టలేకపోతున్నారు, ప్రజలకు చారానా పంచి, బారానా మింగటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, ఇప్పుడు నాసిరకం మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ, మద్యం రేట్లు నాలుగు రెట్లు పెంచి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు, రోడ్లు వేయలేకపోయినా ఆర్టీసీ చార్జీలు మాత్రం దారుణంగా పెంచారు, మన రాష్ట్రంలోనే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఘనత ఈ అసమర్థ ప్రభుత్వానిది, ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు ఇళ్లపై దాడులు చేయడం పరిపాటిగా మారింది, పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది, ప్రతి జనవరిలో ఇస్తానన్న జాబ్ కాలండర్ ఇవ్వలేక చేతులెత్తేసిన దుస్థితి ఈ చేతకాని ప్రభుత్వానిది నిత్యావసర వస్తువులు, ఎరువులు, పురుగులమందులు, గృహ నిర్వహణ వస్తువుల రేట్లుపెంచి, పేదల నడ్డి విరగొట్టిన ఈ ప్రభుత్వ అసమర్ధత,చేతకానితనం గురించి ప్రజలందరికీ తెలుసు పొరపాటున మరోసారి ఈ వైఎస్ఆర్ సీపీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలో మిగిలి ఉన్న వనరులను శుభ్రంగా దోచుకుని, ప్రజలను బానిసలుగా మార్చి, వారికున్న ఆస్తులు అన్ని దోచేసి, ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడ మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను కూడా అమ్మేసి, మన రాష్ట్రాన్ని వెనుజులా దేశం కంటే హీనంగా తయారుచేస్తారు, శ్రీలంకలో వచ్చిన ఆర్థిక పరిస్థితులే మనకూ దాపురిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈసారి విజ్ఞతతో ఆలోచించి, మంచి సమాజం కోసం జనసేన పార్టీని గెలిపించి, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి పాలనను తీసుకొచ్చి, భావితరాల భవిష్యత్తును కాపాడి, ఈ రాష్ట్రాన్ని రక్షించాలని అందరికీ రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.