పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో పలు కుటుంబాలను రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి పరామర్శించడం జరిగింది. గాడాల గ్రామానికి చెందిన బలసాని గోపికి ప్రమాదంలో గాయపడి బాధపడుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన సత్యం సూరిబాబుకి ఇటీవల యాక్సిడెంట్లో గాయాలుపాలైన విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన నార్ని ధనాజీ అనారోగ్యంతో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆచంటి చక్రవర్తి ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. కన్నెం అమ్మాజీ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం జనసేన నాయకుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, అడ్డాల శివ, గాదంశెట్టి వెంకన్నబాబు, మన్యం శ్రీను, అడ్డాల శ్రీను, మదిరెడ్డి బాబులు, అరిగెల రామకృష్ణ, నర్రావుల వెంకటరమణ, వేగిశెట్టి రాజు, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), చిట్టిప్రోలు సత్తిబాబు, సూతపల్లి శ్యామలరావు, బొల్లం దుర్గ, దేవన దుర్గాప్రసాద్ (డిడి), జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.