యలమర్తి సోమబ్రహ్మంకు ఘన నివాళులర్పించిన బత్తుల దంపతులు

రాజనగరం నియోజకవర్గం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, పెరుగుగూడెం వాస్తవ్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మామగారు యలమర్తి సోమబ్రహ్మం గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులు కాగా.. బుధవారం వారి స్వగ్రామంలో పెద్దకార్యం కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి లు హాజరై, నాదెండ్ల మనోహర్ కు సానుభూతి తెలియజేసి. సోమబ్రహ్మం గారి చిత్రపటానికి పూలమాల అర్పిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఘన నివాళులర్పించారు. సోమబ్రహ్మం మృతికి సంతాపం తెలిపిన వారిలో రాజనగరం నియోజకవర్గ సీనియర్ నాయకులు ఉన్నారు..