షష్టి మహోత్సవంలో పాల్గొన్న బత్తుల దంపతులు

రాజానగరం, సీతానగరం మండలం, ముగ్గుళ్ల గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన “శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారి షష్టి మహోత్సవంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో బత్తుల కుటుంబ సభ్యులు స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. అంతకుముందు సీతానగరం మండల జనసేన శ్రేణులు పెద్దఎత్తున అఖండ స్వాగతం పలుకుతూ తీన్మార్ డప్పులతో, బాణసంచా పేల్చుతూ స్వామివారి గుడికి జనసైనికులు కేరింతలతో ఉత్సాహంగా ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగర సీనియర్ నాయకులు మద్దాల యేసుపాదం, పోసి రత్నాజీరావు, గెడ్డం కృష్ణయ్య చౌదరి, గుల్లింకల లోవరాజు, బోయిడి వెంకటేష్, వీర మహిళ సత్యవతి ఇతర జనసేన నాయకులు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.