న్యూ ఇయర్ వేడుకలో బత్తుల

  • గాదరాడ గ్రామంలో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు..
  • పోటెత్తిన జనసేన నాయకులు, జనసైనికులు, ప్రజలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి స్వగ్రామైన’గాదరాడ గ్రామంలో.. నూతన సంవత్సర వేడుకలు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి. బత్తుల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయుటకు జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు, నియోజకవర్గ ప్రజలు పోటెత్తారు. అందరి మధ్యలో ముందుగా వేదికపై వేదపండితుల ఆశీర్వవచనాలు పొంది… 2023 నూతన సంవత్సర వేడుకలో భాగంగా కేక్ కట్ చేశారు.నియోజకవర్గం నలుమూలల నుండి వందలాదిమంది మంది నాయకులు, వేలాదిగా జనసైనికులు, త్వరలో పార్టీలోకి చేరే నాయకులు వచ్చి, పుష్పగుచ్చాలు ఇచ్చి, సాలువతో సన్మానించి గజమాలతో సత్కరించి… స్వీట్స్, పలురకాల పళ్ళు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు బత్తుల దంపతులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కబడ్డీ ప్లేయర్లకు ఉచితంగా జెర్సీలు ఏర్పాటు చేసి, ఆటో యూనియన్ వారిచే వాటిని ఆవిష్కరించడం మరియు ప్రత్యేకంగా తయారైన జనసేన క్యాలెండర్ ఆవిష్కరించడం వచ్చిన వారందరికీ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం పలువురిని ఆకర్షించింది .. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్సాహంగా ఈ కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ… జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాజానగరం నియోజకవర్గం ప్రజలకు, అధికారులకు, జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ… కొత్త సంవత్సరం అందరికీ కలిసి రావాలని, 2022 వ సంవత్సరంలో ఈ దుష్ట పాలన వల్ల ఎన్నో జీవితాలు అతలాకుతలం అయిపోయిన సమయంలో జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించి, జనసైనికులు అందరిలోని స్ఫూర్తి నింపారన్నారు. ఈ సంవత్సరంలో ఎదురైన చేదు అనుభవాలకు వీడ్కోలు చెప్పి.. సరికొత్త ఆశలతో 2023 వ సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని,నేతలు, జనసైనికులు సమిష్టిగా పార్టీ అభివృద్ధికి కృషి చేసి జనసేన పార్టీకి మంచి విజయాన్ని అందించి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలుతో జీవించాలని ఆకాంక్షిస్తూ, న్యూ ఇయర్ వేడుకల్ని ఇంత వైభవంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.