పలువురికి బత్తుల పరామర్శ

రాజానగరం, అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజానగరం నియోజకవర్గ వాసులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మంగళవారం పరామర్శించడం జరిగింది.

  • రాజానగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన నల్లమిల్లి భీమార్జున్ సర్జరీ నిమిత్తం ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని చక్రధర్ హాస్పటల్లో పరామర్శించి కోలుకుంటున్న విధానం అడిగి తెలుసుకున్నారు.
  • రాజానగరం మండలం పుణ్యక్షేత్ర గ్రామ వాస్తవ్యులు అంకం సత్తిబాబు గారు బ్రెయిన్ కంప్లైంట్ మరియు ప్లేట్లెట్స్ తగ్గడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడంతో విషయం తెలుసుకుని వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పడం జరిగింది.
  • సీతానగరం మండలం నాగంపల్లి గ్రామ వాస్తవ్యులు ఏడిద నాగమణి అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన నాయకులు వేగిశెట్టి లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అరిగెల రామకృష్ణ, వేగిశెట్టి రాజు, నాతిపాం దొరబాబు, నరాల రమణ, యర్రంశెట్టి పోలారావు, తోట అనిల్ వాస్, నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.