శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలొ పాల్గొన్న బత్తుల

రాజానగరం, సీతానగరం గ్రామంలో వైభవంగా ఏర్పాటు చేసిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పాల్గొనడం జరిగింది. బత్తుల బలరామకృష్ణకి ఆర్య వైశ్య సంఘం కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ అమ్మవారిని దర్శించి అమ్మవారి చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించడం జరిగింది. అనంతరం కమిటీ వారు బత్తుల బలరామకృష్ణకి శాలువా కప్పి సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఆర్య వైశ్య సంఘం కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.