ఎడ్ల బండ్ల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

  • ముందే వచ్చిన సంక్రాంతి

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఒడిసలేరు గ్రామంలో రాజానగరం నియోజకవర్గం, జి ఎస్ ఎల్ అధినేత డా. గన్ని భాస్కరరావు ఆహ్వానం మేరకు ఎడ్ల బండ్ల పోటీ కార్యక్రమంలో పాల్గొనడమైనది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం పరిసర ప్రాంతాలంతా వ్యవసాయాదారిత ప్రాంతమని ఆ ప్రాంతంలో డా.గన్ని భాస్కరరావు గారు ప్రముఖ వైద్యులు, సంఘ సేవకులు, వ్యవసాయం పట్ల మక్కువ కలిగిన వారు అయినందున తెలుగు రైతులు సంస్కృతి సాంప్రదాయాలు, భావితరాలకు అందించాలని గత మూడు సంవత్సరాలుగా వారి తండ్రి స్వర్గీయ గన్ని సత్యనారాయణ మూర్తి గారి జ్ఞాపకార్థం ఎడ్ల బండ్ల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా భూగర్భ జలాలు లేని చోట్ల కూడా శాస్త్రీయంగా భూగర్భ జలాలు ఎలా పెంచాలి అనేదానిపై అధ్యయనం చేసి అనుభవపూర్వకంగా సుమారు 70 ఎకరాల సువిశాల భూమిలో ఇంకుడు గుంతలు, చిన్న చిన్న మడుగులు ఏర్పాటు చేయించి వర్షపు నీరు వాటిలో నిలువ ఉండేలా ఏర్పాటు చేసుకొని 70 ఎకరాలలో పామాయిల్ పండిస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలిచారు.
రైతులందరిలో ఉత్సహం నింపాలని పశువుల పెంపకంపై ఆసక్తి పెంచాలని రైతులలో పోటీతత్వం పెడితే పంటలు పండించడం లోనే కాకుండా పశువుల పెంపకంలో కూడా పోటీ పడి రైతులలో ఉత్సాహన్నీ నింపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా . గన్ని భాస్కర రావు బత్తుల బలరామకృష్ణ ని, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులను శాలువాలతో సన్మానించారు.