శ్రీరామ నవమి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం, శ్రీరామ నవమి పురస్కరించుకుని శ్రీరంగపట్నం గౌరీ సెంటర్ రామాలయంలో ఘనంగా జరిగిన అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజానగరం మండలం, శ్రీరంగపట్నం గౌరీ సెంటర్ రామాలయం నందు జరిగిన మహా అన్న సమారాధన అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. గౌరీ సెంటర్ రామాలయం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని స్వామివారిని దర్శించి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించి కమిటీ వారితో కలిసి అన్న సమారాధనలో పాల్గొని అన్నవితరణ నిమిత్తం ₹5,000/- రూపాయల విరాళం కమిటీ వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాడి పెద్ద సీతయ్య, దాడి శ్రీను, బీసెట్ జగ్గారావు, గంగయ్య, శ్రీను, దేవన దుర్గాప్రసాద్ మరియు శ్రీరంగపట్నం జనసైనికులు పాల్గొన్నారు.