మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బత్తుల

రాజానగరం నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా.. నేనున్నానంటూ ఎందరికో “ఆపన్న హస్తం” అందిస్తూ…ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా తన ఎనలేని సేవాతత్పరతను చాటుకుంటున్న పేదలపెన్నిధి, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ రథసారథి బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు కిరువైపులా రకరకాల చిరు వ్యాపారులు చేసే వారికి ఎండ, వర్షం నుండే రక్షణ కల్పించే విధంగా గొడుగులు ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి సామాన్యునికి జనసేన పార్టీని చేరువయ్యేలా జనసేన కలర్స్ తో ఈ గొడుగులు ఉండడం అందరినీ ఆకర్షించేలా చేస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన బలరామన్న నాయకత్వంపై జనశ్రేణులు తోపాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.