అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ సమ్మెకు మద్దతు తెలిపిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం ఎం ఆర్ ఓ ఆఫీస్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ కు మద్దతు తెలిపిన “బత్తుల” గత 29 రోజుల నుండి అంగన్వాడీలు నిరవధికంగా తమ డిమాండ్ల సాధనకై చేస్తున్న సమ్మెలో మంగళవారం రాజానగరం జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్ పాల్గొని వారికి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.