పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం నరసాపురం, బొల్లెద్దుపాలెం గ్రామాల్లో పలు కుటుంబాలను శుక్రవారం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా బొల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన కట్ట పోలీస్ ఇటీవల కరెంటు షాక్ కొట్టి ఇంటి వద్దనే వైద్యం చేయించుకుంటున్నారని తెలుసుకుని వారిని పలకరించి ధైర్య చెప్పి వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం నరసాపురం గ్రామానికి చెందిన నాగులపాటి సదాశివరావు మాస్టర్ ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని తెలుసుకుని వారిని పలకరించి ధైర్య చెప్పి వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. తదనంతరం నరసాపురం గ్రామానికి చెందిన ఇంట వీరబాబు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుండి కింద పడటం వలన రెండు చేతులకు తీవ్ర గాయాలు పాలయ్యారని తెలుసుకుని వారిని పలకరించి ధైర్య చెప్పి వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. తరువాత అదే గ్రామానికి చెందిన జోగు సత్తిబాబు ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని తెలుసుకుని వారిని పలకరించి ధైర్య చెప్పి వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కె. వెంకన్నబాబు, మట్ట నాగేశ్వరరావు, ప్రగడ జోగారావు, చదువు శ్రీను, అడ్డాల దుర్గారావు, సంఘ సత్తిబాబు, అడబాల బాబీ, అడ్డాల దొరబాబు, దేవన దుర్గ ప్రసాద్ (డి.డి), యర్రంశెట్టి పోలరావు, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.