రఘుదేవపురం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలు కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ముందుగా బదిరెడ్డి లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని వారిని పలకరించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం ప్యాకెట్ అందజేయడం జరిగింది. అనంతరం మహ్మద్ షాజిత్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పి కుటుంబ అవసరాల నిమిత్తం 5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. తదనంతరం సూరి శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ ఎల్లపుడూ మీకు అండగా ఉంటుందని తెలిపి కుటుంబ అవసరాల నిమిత్తం 5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. అనంతరం ఆకుల నాగేశ్వరరావు ఇటీవల గుండెపోటుతో స్వర్గస్తులయ్యారని, తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పి కుటుంబ అవసరాల నిమిత్తం ₹5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. అనంతరం ఉమ్మిడిశెట్టి పోసుబాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారని తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పి కుటుంబ అవసరాల నిమిత్తం ₹5,000/- రూపాయలు, 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. అనంతరం రుద్రం సత్తిబాబు గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పి ఎప్పుడు ఎ కష్టం వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, నాగారపు సత్తిబాబు, దాసరి రమేష్, రుద్రం నాగు, తన్నీరు సురేష్, పెంటపాడు శివ, భైలపూడి శ్రీను, బొబ్బిరెడ్డి సూరిబాబు, వీరమహిళ లక్ష్మి, గెడ్డం కృష్ణారావు, గట్టి మణిపవన్, రబ్బానీ, రుద్రం కిషోర్, రుద్రం గణేష్, బోడపాటి కరుణాకర్, నేదూరి విగ్నేష్, పోతుల సుబ్రహ్మణ్యం, ఎరుబండి కిషోర్, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.