మాజీ సర్పంచ్ అక్కిరెడ్డిని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామ మాజీ సర్పంచ్ అక్కిరెడ్డి మహేష్ అనారోగ్యంతో బాధపడ్తున్నారని తెలుసుకున్న రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శనివారం వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు యర్రంశెట్టి శ్రీను, బుంగ స్టాలిన్, బొడ్డపాటి నాగేశ్వరరావు, మార్గాని సత్తిబాబు, గారబోయిన లోవరాజు, సుంకర సూరిబాబు, సుంకర శ్రీను, అమలకోటి సూరిబాబు, అల్లాడి సూరిబాబు, వీరాటి చిన్న, హోటల్ రాజు, అక్కిరెడ్డి వేణు, చిటికెన రఘువీర్, వీరమహిళ చేపల లక్ష్మి, అడ్డాల దొరబాబు, దేవన దుర్గ ప్రసాద్ (డిడి) మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.