రాజానగరం నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం మండలం, పరిజల్లిపేట గ్రామంలో పరిమి ఈశ్వర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”. అనంతరం రాజానగరం మండలం, పరిజల్లిపేట గ్రామం లో చిక్కిరెడ్డి సాయిబాబా గారికి కంటికి గాయం అయిందని స్థానిక నేతలు ద్వారా తెలుసుకుని వారిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. రాజానగరం మండలం, పరిజల్లిపేట గ్రామంలో నాతిపాం చక్రవర్తి అమ్మ కీ|శే| బూరమ్మ ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి పరామర్శించారు. అనంతరం రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవన నరసన్న బంధువులు కీ|శే గండి సుబ్బారావు (పెత్తందారు) ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.