కే.వి సుబ్బారావు ఆసుపత్రిలో పలువురిని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాడాల గ్రామనికి చెందిన మగారపు రాజు కే వి సుబ్బారావు ఆసుపత్రిలో కాలుకి ఆపరేషన్ చేయించుకున్నారననే విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో- ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. అనంతరం రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన జనసైనికుడు తెల్లమేకల స్వామి కుమార్, చిన్నపాటి ప్రమాదంలో గాయాలుపాలై కే వి సుబ్బారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారననే విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో- ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులు, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, మండల జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.