జీడి మామిడి, మామిడి రైతులతో పోరుబాట పట్టిన బత్తుల

  • జీడి మామిడి, మామిడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి..
  • రైతులను ఆర్థికంగా దెబ్బ కొట్టి.. వారు అప్పులు పాలై వారి భూములు అమ్ముకునేలా స్థానిక నేతలు వారి అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనుటకు రైతులపై కుట్రలు చేస్తున్నారన్న అన్న అనుమానం రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు..
  • ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఉద్యానవన పంటలకు పంట నష్ట పరిహారం ఎందుకు చెల్లించడం లేదు..
  • జీడి పిక్కల బస్తా కనీసం మద్దతు ధర 15 వేలుగా ప్రకటించి, ఆర్.బి.కే ద్వారా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలి..
  • నాలుగు సంవత్సరాల నుండి పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీడి మామిడి, మామిడి రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి..
  • మామిడి పంటకు ఇతర ప్రాంతాల్లో మార్కెట్ సదుపాయాలు కల్పించడంతో పాటు, రైతులు నిల్వ చేసుకోవడానికి గ్రామాల్లో శీతల గిడ్డంగులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి..
  • వ్యవసాయ పరిశోదన కేంద్ర అధికారులు జీడి మామిడి, మామిడి పంటల రైతులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వ్యవసాయ విధానాలపై శాస్త్రీయంగా అవగాహనా కల్పించాలి..
  • రైతులకు న్యాయం జరగని పక్షంలో రైతులతో కలిసి జనసేన పార్టీ పక్షాన, ప్రజా పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం…..

రాజానగరం: రాజానగరం మండలం, రాజానగరం గాంధి బొమ్మ సెంటర్ లో జీడిమామిడి (జీడిపిక్కల), మామిడి రైతుల పక్షాన శనివారం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ నిరసన ధర్నా చేశారు.. గత నాలుగు సంవత్సరాలుగా జీడిమామిడి, మామిడి రైతులకు పంటలు సరిగ్గా పండక… పండినా సరైన గిట్టుబాటు ధర లేక, పెట్టుబడులు ఎక్కువై, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు అండగా ఉండి ,సరైన గిట్టుబాటు ధర కల్పించి…. వారి వద్దనున్న జీడిపిక్కలను సరైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనాలనే ప్రధాన డిమాండ్ తో జనసేన పార్టీ పక్షాన ప్రజానాయకులు బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వందలాది జీడిమామిడి, మామిడి రైతులతో, జనశ్రేణులతో మహానిరసన ధర్నా చేపట్టారు.. ముందుగా రాజానగరం గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి జనసేన నేతలు, రైతులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజానగరం నియోజకవర్గంలో తరతరాలుగా జీడీ మామిడి, మామిడి పంటలు పండించి అమ్ముకోవడమే ఇక్కడ రైతుల జీవన ఆధారం.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీడిమామిడి,మామిడి రైతుల పరిస్తితి చాలా దయనీయంగా తయారయింది. ఎరువులు, పురుగు మందులకు సబ్సిడీ పై ఇవ్వట్లేదు.. అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాల క్రితం జీడి మామిడి బస్తా 12 వేల నుండి 14 వేల రూపాయలు ఉంటె నేడు మరీ దారుణంగా 3 నుండి 4 వేల రూపాయలకు అడుగుతున్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటుధర రాక, కనీసం పెట్టుబడి కూడా రాకపోవడం వల్ల రైతులు దిక్కుతోచని స్తితిలో ఉన్నారు.. చేతికిందొచ్చిన జీడిపిక్కలు ఎవరూ కొనక, కొన్ని రోజుల్లో వర్షాలు వస్తే జీడి పిక్కలు ఎక్కడ నిల్వ చేయాలో కూడా అర్ధంకాని పరిస్తితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.. ఒక బస్తా జీడి పిక్కలు పండించడానికి ఎరువులు, పురుగుమందులు, ఎండు పుల్ల తీయుట, దుక్కు దున్నుట, నీరు పెట్టుట, జీడి గింజలు ఏరడానికి సుమారుగా 5,000 నుండి 6,000 వరకు ఖర్చు అవుతున్నా.. దానికి తగ్గ ధర లేక, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పంట కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకునే స్తితిలో రైతులు ఉన్నారు. దీనికి పూర్తి బాద్యత ప్రభుత్వమే వహించి ఆర్.బి.కే ల ద్వారా కనీస మద్దతు ధర 15 వేల రూపాయలతో వెంటనే కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. జీడి మామిడి, మామిడి రైతులతో కలిసి ప్రభుత్వ నిర్లక్ష వైకరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడి రైతులకు న్యాయం చేయాలనీ నినాదాలు చేస్తూ… రాజానగరం గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలిగా నడుచుకుంటూ వెళ్లి ఎండిఓ కి వినతి పత్రం అందజేసి తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేసి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ఈ విషయంపై ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నామని .. ఈలోగా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోతే ంఫ్డో ఆఫీస్ ముట్టడించి రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి కూడా సిద్దంగా ఉన్నామని, రైతులకు న్యాయం జరగని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని, గ్రామ గ్రామానికి తిరిగి రైతులతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించి ఈ Yఛ్ఫ్ ప్రభుత్వానికి సరైన సమయములో బుద్ది చెబుతామని హెచ్చరిస్తూ, ఈ నిరసన ధర్నాను విజయవంతం చేసిన రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ నిరసన ధర్నాలో పెద్ద ఎత్తున జీడి మామిడి, మామిడి రైతులు, ఇతర రైతులు, ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు వందలాదిగా పాల్గొన్నారు.