పోలీసుల తీరును నిరసిస్తూ బత్తుల నిరసన

  • అధికార పార్టీ అండదండలతో శ్రీరంగపట్నం గ్రామస్తులపై (జనసేన టిడిపి కార్యకర్తలు) అకారణంగా జరిగిన పోలీసుల దాడిని ఖండిస్తూ.. కోరుకొండ డీఎస్పీ కార్యాలయం వద్ద న్యాయం కోసం నిరసన తెలిపిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన – తెలుగుదేశం నాయకులు

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో గత 5 సంవత్సరాలుగా జనసేన – తెలుగుదేశం పార్టీలకు చెందిన సానుభూతిపరులు, గ్రామస్తులు వాలీబాల్ ఆడుకుంటున్న స్థలంలో నేడు అధికార పార్టీ నేతల అండతో పోలీస్ శాఖ వారు అకారణంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గ్రామస్తులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు అండగా ఉండి, దాడిని ఖండిస్తూ.. బాధితులకు న్యాయం జరగాలని, ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. కోరుకొండ మండల డీఎస్పీ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మరియు టీడీపీ సీనియర్ నాయకులు తనకాల నాగేశ్వరరావు, మల్ల అవతారం, బదిరెడ్డి రాజా, బుద్ధ బాబ్జి, దాడి శ్రీను, బుద్ధ బ్రహ్మాజీ, సూరిశెట్టి గుబ్బాలు, కర్రి శ్రీను, కొయిడాల గంగయ్య, సూరిశెట్టి చిన్నారి, దాడి సీతయ్య, సూరిశెట్టి మహేష్, బీశెట్టి శ్రీను, దొడ్డి అప్పలరాజు, డీజే స్వామి గారు, అడ్డాల శ్రీను గారు, మదిరెడ్డి బాబులు, అడపా శ్రీనివాస్, తన్నీరు తాతాజీ, కొత్తపల్లి రఘు, గల్లా రంగ, శెట్టి, బొబ్బిలి సత్తిబాబు, అతికింశెట్టి శ్రీను, తోట అనిల్ వాసు, దేనెడి మణికంఠ స్వామి, దేవన దుర్గాప్రసాద్, జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.