వేములవాడలో ఘనంగా ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు

వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాలను మహిళలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇదే అనవాయితీని పాటిస్తూ వేములవాడ పట్టణంలోని మూలవాగు వద్ద గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు స్థానిక మహిళలు. వివిధ ప్రాంతాల్లోని తరలివచ్చిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్త జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మెన్ మాధవి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, పట్టణ ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.