బైకు ప్రమాదంలో గాయపడ్డ జనసేన క్రియాశీలక సభ్యుడిని పరామర్శించిన బీసీ ఇందిరమ్మ

బనగానపల్లె పట్టణం, ఈద్గానగర్ కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు రామ గురువాచారిని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ జనసేన పార్టీ నాయకులు చిన్నబాబు (గబ్బర్ సింగ్) భాస్కర్ లతో కలిసి పరామర్శించారు. శుక్రవారం నంద్యాల నుండి బనగానపల్లెకు వస్తూ మిట్నాల గ్రామం దగ్గర బైక్ అదుపుతప్పి రామాచారి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న బీసీ ఇందిరమ్మ గాయపడ్డ రామాచారిని కలిసి జనసేన పార్టీ సభ్యులు కూడా తమ వారేనని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని రామ గురువాచారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సలాం జనసేన పార్టీ నాయకులు కాసిం, షేక్షావలి, ప్రసాద్, హాజీవలి తదితరులు పాల్గొన్నారు.