పాఠశాలల మౌలిక వసతులకై బెక్కం జనార్దన్ డిమాండ్..

  • రక్షణ లేని పాఠశాలకు వెళ్తున్న చిన్నారుల కోసం ఇంటికి క్షేమంగా రావాలని ఎదురు చూస్తున్న తల్లి తండ్రులు..

జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకై జనసేన పార్టీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ బెక్కం జనార్ధన్ డిమాండ్ చేసారు.. జగిత్యాల నియోజకవర్గం కో ఆర్డినేటర్ బెక్కం జనార్దన్ అధ్వర్యంలో హన్మజిపేట గ్రామ ప్రభుత్వపాఠశాలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కొరవడుతున్నాయి, విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని చెపుతున్న ప్రభుత్వం విషయాన్ని ఆచరణలో చూపడం లేదు అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని చాలా పాఠశాలల్లో మూత్ర శాలలు, మంచినీటి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా అన్ని పాఠశాలలకి నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఉన్న చాలా పాఠశాలల్లో నీరు రావట్లేదు అని మా దృష్టికి వచ్చింది అన్నారు.
దీనిలో భాగంగా జగిత్యాల నియోజక వర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు హన్మజీపేట గ్రామంలో పాఠశాలను సందర్శించాము అన్నారు. పాఠశాలలో చాలా సమస్యలు ఉన్నాయని గుర్తించాము. అందులో త్రాగునీటి సమస్య ప్రధాన సమస్య
మరియు రోడ్ అనుకొనీ ఉన్న పాఠశాలకి ప్రహారీ గోడ లేదు అని అన్నారు. మూత్ర శాలలు ఉన్నా.. నీటి సౌకర్యం లేక అవి అధ్వానంగా ఉన్నాయి అని, ప్రభుత్వం వెంటనే స్పందించిపాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని బెక్కం జనార్దన్ జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తలు బొల్లి రాము, చింతా సుధీర్, దరూరీ వంశీ, గోడిసెల బాలు గౌడ్, బొల్లి లక్ష్మన్, సనిగరపు రాకేష్, ఎదురుగట్ల ప్రభాకర్, తాటిపెల్లి అజయ్, దరి గౌతం తదితరులు పాల్గొన్నారు.