ముంబై కి మకాం మార్చేసిన బెల్లంకొండ

రీసెంట్ గా అల్లుడు అదుర్స్ అంటూ వచ్చిన బెల్లం కొండ శ్రీనివాస్.. ప్రస్తుతం ముంబై మకాం మార్చేశాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం వినాయక్ డైరెక్షన్లో ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు శ్రీనివాస్.

ఈ క్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడి ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. తన తొలి హిందీ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు శ్రీనివాస్ అక్కడే మకాం ఉంటాడని అంటున్నారు.

అంతేకాదు, ‘ఛత్రపతి’ రీమేక్ తర్వాత బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకే, అక్కడ ఫ్లాట్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి, మన టాలీవుడ్ హీరో బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవుతాడేమో చూద్దాం!