చింతలపూటి చంద్ర మోహన్ కుటుంబాన్ని పరామర్శించిన బెల్లంకొండ సాయిబాబు

గిద్దలూరు నియోజక వర్గం బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ల గ్రామం జనసైనికుడు చింతలపూటి చంద్ర మోహన్ డిసెంబర్ 24 వ తేదీన కారు ప్రమాదంలో గాయపడి ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 1 వ తేదీన తుదిశ్వాస విడిచారు. చంద్ర మోహన్ తల్లి, తండ్రి, అన్నయ్య శేఖర్ లను పలకరించి ధైర్యంగా వుండమని చెప్పిన జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు వారికి 25000/- ఆర్ధిక సహాయం చేశారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. క్రియాశీలక కార్యకర్త కావున పార్టీ నుంచి రావలసిన 5లక్షల బీమా త్వరలో వచ్చేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య , కంభం మండలం అధ్యక్షుడు తాడిశెట్టీ ప్రసాద్, వాటర్ హుస్సేన్, కులార విష్ణు, ధుమ్మని చెన్నయ్య, మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.